హిందీ , తెలుగు, తమిళ్ భాషలలో గ్లామర్ పాత్రల్లో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ గతంలో తాను ఎదుర్కున్న పలు క్యాస్టింగ్ కౌచ్ మరియు లైంగిక వేధింపుల సంఘటనల గురించి వెల్లడించింది.
ఇందులోభాగంగా తాను ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించిన ఓ బాలీవుడ్ చిత్రంలో కామెడీ రోల్ లో నటించానని, ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ చిత్ర షూటింగ్ కి వెళ్ళినపుడు తనకి ఓ స్టార్ హోటల్ లో అకామిడేషన్ ఇచ్చారని దీంతో షూటింగ్ అయిపోగానే హోటల్ రూమ్ కి వెళ్లిన సమయంలో ఇదే చిత్రంలో నటిస్తున్న ఓ నటుడు అర్థరాత్రి తన గది తలుపుని బాదుతూ బలవంతంగా బెడ్ రూమ్ లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడని తెలిపింది. దాంతో మళ్ళీ ఆ హీరోతో కలసి ఇప్పటివరకూ నటించలెదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక మరోసారి కొంతమంది హీరోలు అర్థరాత్రి మీటింగ్, డేటింగ్ అంటూ ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని తెలిపింది. ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ఇండస్ట్రీలో రాణించలేమని చెప్పుకొచ్చింది.
Also Read : సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా..?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మల్లికా షెరావత్ హిందీలో 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కాబోతోంది.
ఈ మధ్య ప్రతీఒక్కరికి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై అవగాహన ఉండటం అలాగే మహిళలపై జరుగుతున్న అకృత్యాలని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుండటం వంటివాటి కారణంగా కొందరు నటీమణలు ధైర్యంగా సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న సమస్యల గురించి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.
________