ఎన్డీఏ సర్కారు ఎప్పుడైనా కూలొచ్చు: ఖర్గే

ఎన్డీఏ సర్కారు ఎప్పుడైనా కూలొచ్చు:  ఖర్గే

బెంగళూరు: కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దానికి కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వ ఏర్పాటే పొరపాటున జరిగిందని అన్నారు. అది మైనార్టీ ప్రభుత్వమని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంపూర్ణమైన బలం లేదని, మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. 

దేశ హితం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు ఖర్గే చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 240 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ మార్క్ 272 కంటే తక్కువకు పడిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీఆర్‌వీ వంటి దాని మిత్రపక్షాలపై ఆధారపడింది. టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీఆర్‌వీ వరుసగా 16, 12,5 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.