
- కేంద్రం కొద్ది మంది బిలియనీర్ల ఖజానానే నింపింది: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ వెర్షన్ సామాన్య ప్రజల జేబులను ఖాళీ చేసి.. కొంత మంది సెలెక్టెడ్ బిలియనీర్ల ఖజానాను నింపిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజలకు ఖర్చు చేయడానికి అదనపు ఆదాయం లేదన్నారు. దేశంలో నిరుద్యోగం భరించలేనంతగా పెరిగింది.. కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపూరితంగా ఉందని ఎద్దేవా చేశారు.
“మోదీ గారూ, 100 కోట్ల మంది ఇండియన్స్‌కు ఖర్చు చేయడానికి అదనపు ఆదాయం లేదు. మన జీడీపీలో 60 శాతం వినియోగంపైనే ఆధారపడి ఉంది. అయితే దేశంలోని టాప్10 శాతం మంది మాత్రమే ఆర్థిక వృద్ధిని, వినియోగాన్ని నడిపిస్తున్నరు. 90 శాతం మంది ఇండియన్స్ తమ రోజువారి అవసరాలను తీర్చుకునేంత స్థాయిలో కూడా కొనుగోళ్లు జరపలేకపోతున్నారు’’ అని ఖర్గే గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘దేశంలో పన్ను చెల్లిస్తున్న వారిలో 50 శాతం మంది గత దశాబ్దంలో ఎటువంటి జీతాలు, వేతనాల వృద్ధిని పొందలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఏకంగా వేతనాల్లో తగ్గుదల(ద్రవ్యోల్బణం పెరిగి) ఉంటుంది. సంపద కేంద్రీకరణ పెరిగిపోతున్నది. మీ విధానాలు భారతీయులదరి ఆదాయాలు పెచడంలో ఫెయిల్అయ్యాయి” అని విమర్శించారు. పదేండ్లుగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సామాన్యుల పొదుపు 50 ఏండ్ల కనిష్టానికి పడిపోయిందన్నారు.