
కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వ్యవస్థల్ని చేతుల్లో పెట్టుకుని కాంగ్రెస్ ను వేధిస్తున్నారని మండిపడ్డారు. తమ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు. డబ్బులు లేక తమ పార్టీ నేతల్ని ప్రచారాలకు కూడా పంపించడం లేదన్నారు. అకౌంట్ల ఫ్రీజ్ పై ఇప్పటి వరకు ఈసీ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు రాహుల్. ఎన్నికల టైమ్ లో కావాలనే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మోదీ, అమిత్ షా కలిసే కుట్ర చేస్తున్న కుట్ర అని ఆరోపించారు
మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లిఖర్జున ఖర్గే. అధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతం కాకుడదన్నారు. రాజకీయ పార్టీలు ఐటీ పరిధిలోకి రావన్న ఖర్గే.. కాంగ్రెస్ ను కావాలనే ఐటీతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లు తీవ్రమైన అంశమని.. దీనిపై విచారణ జరగాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ALSO Read ; ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
కాంగ్రెస్ ను అర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం తీరు సరిగ్గా లేదన్న ఆమె.. కాంగ్రెస్ అకౌంట్లపై ఫ్రీజ్ తొలిగించాలని కోరారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహిన పరిచే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అకౌంట్లపై కాదు ప్రజాసౌమ్యంపైనే దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ అభిప్రాయపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారి బీజేపీకే లాభమన్నారు. కాంగ్రెస్ పార్టీ మీదే టార్గెట్ ఎందుకని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ మాత్రమే ఫ్రీజ్ చేశారన్నారు మాకెన్.