మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు: బీజేపీపై ఖర్గే విమర్శలు

మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు: బీజేపీపై  ఖర్గే విమర్శలు

న్యూఢిల్లీ: రాజ్యాంగం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి మహారాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యాంగం రెడ్ కవర్ కాపీని చూపిస్తూ అర్బన్ నక్సల్స్ నుంచి సాయం తీసుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. 

‘‘రాజ్యాంగాన్ని నక్సలిజంతో పదేపదే ముడిపెట్టడం ద్వారా బీజేపీ దేశంలో మనుస్మృతిని అమలు చేయాలనే తమ ఎజెండాను తీసుకురావాలనుకుంటున్నదా? ఇదే ప్రశ్నను దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత, మోదీని కూడా అడుగుతున్నాను. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేద వర్గాలకు రాజ్యాంగం సమాన హక్కులను కల్పించడాన్ని బీజేపీ, ఆర్ఎస్ ఎస్  నేతలు సహించలేకపోతున్నారు” అని ఖర్గే విమర్శించారు.