కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మల్లికార్జున్ ఖర్గే.. విషెస్ తెలిపిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మల్లికార్జున్ ఖర్గే.. విషెస్ తెలిపిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మల్లికార్జున్ ఖర్గేకు ఆపార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ( అక్టోబర్ 26) ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ శాలువా కప్పి , కేక్ కట్ చేసి మిఠాయి తినిపించి ఖర్గేకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 

ప్రజాసేవ చేయాలనే పార్టీ సంకల్పాన్ని మీ నాయకత్వం బలోపేతం చేసింది. మీ పోరాటం మరియు అనుభవం మాకు స్ఫూర్తినిస్తాయి. రాజ్యాంగాన్ని , ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేందుకు మల్లిఖార్జున్ ఖర్గే మార్గదర్శకత్వం ప్రతి న్యాయ యోధుడికి ఎంతో విలువైనది అని ట్వీట్ చేశారు రాహుల గాంధీ. 

ALSO READ | ఇండియన్ స్కిల్డ్ వర్కర్లకు.. ఇకపై ఏటా 90 వేల జర్మన్ వీసాలు

మల్లికార్జున్ ఖర్గే 2022 అక్టోబర్ 19న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి పార్టీ బలోపేతం చేయడంతో కీలకపాత్ర పోషించారు. రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్రను విజయవంతంగా నడిపించారు.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టడంతో కీలకంగా వ్యవహరించారు.