మోదీ ప్రభుత్వంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్

మోదీ ప్రభుత్వంపై మల్లిఖార్జున ఖర్గే ఫైర్

ఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలను ఈసీకి అందించడంలో ఎస్ బీఐ చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఎస్ బీఐని మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా వాడుకుంటోందని అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ టర్ము జూన్‌ 16తో ముగుస్తుందనగా ఎస్బీఐ జూన్‌ 30దాకా గడువు కోరడమేంటని ఖర్గే ప్రశ్నించారు.

ALSO READ :- కడెం హైవేపై రైతుల బైఠాయింపు

ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా అత్యధికంగా అక్రమ లావాదేవీలు జరిపింది మోదీ బీజేపీయేనని మండిపడ్డారు. మార్చి 6వ తేదీకల్లా ఈసీకి బాండ్ల వివరాలందించాల్సిన ఎస్బీఐ డెడ్‌లైన్‌ను జూన్‌ 30 దాకా పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.