జనవరి 27న తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, రాహుల్


హైదరాబాద్ :కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, లోక్ సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ జనవరి 27న  తెలంగాణలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న 'సంవిధాన్ బచావో' కార్యక్రమంలో వారు పాల్గొంటారు.

 రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.