మెదక్ అభివృద్ధి ఇందిరా గాంధీ ఘనతే : మల్లికార్జున ఖర్గే

మెదక్ అభివృద్ధి ఇందిరా గాంధీ ఘనతే : మల్లికార్జున ఖర్గే

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకే దక్కుతుందని ఏఐసీసీ ప్రెసిడెంట్​మల్లికార్జున ఖర్గే అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం చిన్నగొట్టి ముక్కలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ విజయభేరి బహిరంగ సభకు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 1980లో మెదక్​ జిల్లా ప్రజలు ఇందిరా గాంధీని ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు.

ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నపుడే ఆమె దేశ ప్రధాన మంత్రి అయ్యారని, ఆ సమయంలోనే మెదక్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన బీహెచ్​ఈఎల్, డీఆర్​డీఓ, ఎయిర్​ ఫోర్స్​ అకాడమీలు ఏర్పాటుచేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే సోనియాగాంధీ  ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. నర్సాపూర్​అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఖర్గే కోరారు. 

సభ సక్సెస్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విజయభేరి బహిరంగ సభకు నియోజవర్గంలోని అన్నిమండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏఐసీసీ ప్రెసిడెంట్​ మల్లికార్జున ఖర్గే హాజరు కావడం, సభ సక్సెస్​ కావడం కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల్లో జోష్​ పెంచింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ రాష్ట్ర నాయకులు చిలుముల సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్,  జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, శేష సాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నవీన్ గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కమలా పూల్​సింగ్​, నాయకులు రవీందర్ గౌడ్, శ్రీనివాస్, గణేశ్ గౌడ్, లక్ష్మీకాంతం, అశోక్  పాల్గొన్నారు.