దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసాధ్యమని ఖర్గే తేల్చిచెప్పారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం అవసరమని.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ఎన్డీఏ సర్కార్ దుందుడుకు నిర్ణయాలు సరికాదని అన్నారు. అయినా.. ప్రధాని మోడీ చెప్పింది ఎప్పుడూ చేయరని ఖర్గే సెటైర్ వేశారు.
ALSO READ | ఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ
కాగా, గురువారం దీపావళి వేడుకల్లో భాగంగా గుజరాత్లో పర్యటించిన మోడీ.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింధ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రముఖులు, మేధావులు, ప్రజాభిప్రాయం స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతికి నివేదిక అందించింది.