ఫ్రీ గిఫ్టులు, డిస్కౌంట్లను నమ్మి మోసపోవద్దు : మల్లికార్జున్​బాబు

కామారెడ్డి టౌన్, వెలుగు: ఫ్రీ గిఫ్టులు, డిస్కౌంట్లను నమ్మి ప్రజలు మోసపోవొద్దని కామారెడ్డి డీఎస్వో(జిల్లా పౌర సరఫరాల ఆఫీసర్) మల్లికార్జున్​బాబు పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్​లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్, డిజిటల్​వర్తకంలో వినియోగదారుల రక్షణ అనే అంశంపై బుధవారం మీటింగ్​ నిర్వహించారు. 

డీఎస్వో మాట్లాడుతూ.. ఈ కామర్స్, డిటిజల్​ వర్తకాన్ని ఉపయోగించడం వల్ల వినియోగదారులకు రక్షణ ఏర్పడుతుందన్నారు. గుర్తింపు లేని రిటైలర్ల నుంచి వస్తువులు కొనుగోలు చేయొద్దన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్​కాల్స్, మెయిల్స్, ఎస్​ఎంఎస్​లకు స్పందించవద్దని సూచించారు. సివిల్​సప్లయ్​డీఎం అభిషేక్ ​సింగ్, మెప్మా పీడీ శ్రీధర్​రెడ్డి, వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్​సువర్ణ, రేషన్​ డీలర్లు, గ్యాస్ ​డీలర్లు, రైస్​మిల్లర్స్​అసోసియేషన్​ ప్రతినిధులు పాల్గొన్నారు.