ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గేకు అస్వస్థత

ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గేకు అస్వస్థత

జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో AICCచీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. కథువా బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. కాస్తన్ని నీళ్లు తాగిన ఖర్గే.. మళ్లీ ప్రసంగం కొనసాగించారు. ఆయన అస్వస్థతకు గురికాక ముందే తనకు ఎనబై మూడేళ్లు అయినప్పటికీ.. ఫిట్ గా ఉన్నాని అన్నారు. మోదీ సర్కార్ ను గద్దె దించే వరకు బతికే ఉంటానన్నారు ఖర్గే. జమ్ము కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన అన్నారు. 

కతువాలో ఉగ్రవాదులతో జరుగుతున్న ఆపరేషన్‌లో మరణించిన హెడ్ కానిస్టేబుల్‌కు నివాళులు అర్పిస్తున్న సమయంలో వేదికపై ఉన్న ఖర్గే తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టే ర్యాలీలో ప్రసంగించేందుకు ఖర్గే జస్రోటాకు వెళ్లారు. ఉదంపూర్ జిల్లాలోని రాంనగర్‌లో జరిగే మరో బహిరంగ ర్యాలీలో ఈరోజు కూడా ఆయన ప్రసంగించనున్నారు.
 

ALSO READ | హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్​పై మోదీ మాట్లాడరేం: కర్నాటక సీఎం సిద్ధరామయ్య