మోదీ సర్కారు దేశ భద్రతను ప్రమాదంలో పెట్టింది

మోదీ సర్కారు దేశ భద్రతను ప్రమాదంలో పెట్టింది
  • కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను ప్రమాదంలో పెట్టిందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో చైనా 90 కొత్త గ్రామాలను ఏర్పాటు చేస్తోందని వచ్చిన వార్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘‘వాస్తవాలను నిర్ధారించుకుని ఈ ఆరోపణలు చేస్తున్నం. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో 90 కొత్త గ్రామాలను చైనా ఏర్పాటు చేస్తోంది..

 గతంలో కూడా డ్రాగన్ 628 ఇటువంటి గ్రామాలనే బార్డర్ లో ఏర్పాటు చేసిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. బార్డర్ లో చేపట్టిన వైబ్రంట్ విలేజేస్ ప్రోగ్రామ్ గురించి మోదీ ప్రభుత్వం బాగా ప్రచారం చేస్తోంది. పార్లమెంటులో అంతకు మించి చెబుతోంది. 2023, ఫిబ్రవరిలో ఈ స్కీమ్ ను లాంచ్ చేసి రూ.4,800 కోట్ల ఫండ్స్ ను కేటాయించారు. 

కానీ, గత రెండేండ్లలో మాత్రం రూ.509 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. అంటే 90 శాతం నిధులను ఖర్చు చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ చైనాపై ఆగ్రహించాల్సింది పోయి దానికి రెడ్ సెల్యూల్ చేస్తున్నారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను మోదీ సర్కారు ప్రమాదంలో పెట్టింది” అని ఖర్గే విమర్శించారు.