వైరా, వెలుగు : వైరాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రూ.3.20 కోట్లతో అభివృద్ధి చేయనున్న రామలింగేశ్వర స్వామి ఆలయ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎండోమెంట్ ఏర్పాటు చేసిన మ్యాప్ ను పరిశీలించారు.
అనంతరం ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతి సత్యనారాయణ, ఎదునూరి సీతారాములు, దొడ్డ పుల్లయ్య, మల్లు రామకృష్ణ, అడుసుమిల్లి గణేశ్, నాగేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏసీపీ రెహమాన్, ఎండోమెంట్ డీఈ, ఈవో చంద్రశేఖర్ శర్మ, ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు పాల్గొన్నారు.