
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్ల వల్లే కొప్పుల ఈశ్వర్ మంత్రి అయ్యాడని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ఏమీ చేయలేదని మాట్లాడడం ఆయన అవగాహనాలోపానికి నిదర్శనమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితులు, గిరిజనులకు వ్యవసాయ భూములు, ఇండ్లు ఇవ్వడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను అమలు చేసిన విషయం ఈశ్వర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.