సోనియా తెలంగాణ తల్లి .. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: మల్లు రవి

సోనియా తెలంగాణ తల్లి ..  కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ‘తెలంగాణ తల్లి’గా భావిస్తారని ఆ పార్టీ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత మల్లు రవి అన్నారు. ఏపీలో పార్టీ బతకదని తెలిసినా.. ప్రజల ఆక్షాంక్షలను అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం ఆమె ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. అలాంటి తెలంగాణ తల్లిని.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏ హోదాలో ఆహ్వానిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి చేసిన కామెంట్లపై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గురువారం ఇండియా కూటమి తరఫున సెంట్రల్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతీ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ క్వార్టర్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తర్వాత తెలంగాణ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ‘తెలంగాణ తల్లి’గా పిలవబడే సోనియాను తాము ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర చరిత్ర తెలియని కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాలనకు అనర్హుడన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని.. సోనియా గాంధీకి, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించినట్లే... కేంద్రంలో మోదీ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 12 –14 స్థానాల్లో విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ నియోజక వర్గం నుంచి తాను లక్ష మెజార్టీతో గెలువబోతున్నట్లు చెప్పారు.