కొందరు నేతల చేరికలపై భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నయ్..కాంగ్రెస్ నేత మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్  పార్టీలో విభేదాలు ఎప్పుడూ లేవని, కాకపోతే భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయని కాంగ్రెస్  నేత మల్లు రవి అన్నారు. కొందరు నేతల చేరికలపై స్థానికంగా కొందరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాంటి వారికి సర్దిచెప్పుకుంటూ ముందుకెళ్తామన్నారు. సోమవారం ఢిల్లీ లో మీడియాతో  ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్​పై జీజేపీ చీఫ్ నడ్డా, స్టేట్​ చీఫ్​ సంజయ్ కి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు.

ALSOREAD:బతుకమ్మ వాగు బ్రిడ్జికి ముప్పు ..నిరుడు భారీ వరదలతో తెగిపోయిన అప్రోచ్​రోడ్డు

 నాగర్ కర్నూల్ సభలో నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటే... ధరణిని రద్దు చేయం, కేవలం మార్పులు చేస్తామని సంజయ్  వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ‘‘ఈ ఇద్దరు బీజేపీ లీడర్ల మధ్య విభేదాలున్నాయా? ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం? అవినీతిలో కేసీఆర్, లిక్కర్ స్కామ్​లో 
కవితను జైలుకు పంపుతామని చెబుతున్నారు. కానీ, మాటలు తప్ప చేతల్లో అది కనిపించడం లేదు”  అని రవి వ్యాఖ్యానించారు.