
- తెలంగాణలో పార్టీ విజయంపై నేతల చర్చ
న్యూఢిల్లీ, వెలుగు : నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గురువారం ఢిల్లీలోని పలువురు పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నుంచి తనకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో సీట్లు సాధించడంపై పార్టీ ముఖ్యనేతలు అందించిన సహకారం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా పాలన అందించే దిశలో తీసుకోబోతున్న నిర్ణయాలను ఆయన వివరించారు. నాగర్‌కర్నూల్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన మల్లు రవిని ఖర్గే, కేసీ వేణుగోపాల్ అభినందించారు.