తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. మార్చి 2న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలోని వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. కాగా.. స్వరాజ్యం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు డాక్టర్లు తెలపడంతో ఆమె కుటుంబసభ్యులు, సీపీఎం నేతలు బీవీ.రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలివస్తున్నారు. స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులతో సీపీఎం నేతలు ఆరా తీస్తున్నారు. ఈ సాయంత్రం వరకు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ప్రకటన చేయనుంది.
For More News..
ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్