పిల్లల్లో పౌష్టికాహార లోపం

  •     ఎత్తు పెరుగుతలే.. బరువైతలే 
  •     యాదాద్రిలోని 46 వేల మంది పిల్లల్లో..11,811 మంది బలహీనం
  •     సూర్యాపేటలో 44,575 మందిలో..13,474 మంది వీక్​ 
  •     ఎన్​హెచ్ టీఎస్ సర్వేలో వెల్లడి

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : పౌష్టికాహార లోపంతో పిల్లలు బలహీనమైతున్నరు. ఏజ్​కు తగ్గట్టుగా కొందరు పిల్లలు ఎత్తు.. బరువు పెరుగుతలేరు. ఇటీవల మాతా, శిశు సంరక్షణ శాఖ నిర్వహించిన న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌టీఎస్‌‌‌‌) సర్వేలో తేలింది. 

యాదాద్రిలో 1.86 లక్షల ఇండ్లలో  సర్వే..

పోరగాళ్ల ఆరోగ్యంపై ఏటా న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ద్వారా మాతా, శిశు సంరక్షణశాఖ మాన్యువల్​గా నిర్వహించే సర్వే ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో చేసింది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్  ప్రాజెక్టుల పరిధిలోని 901 అంగన్ వాడీ సెంటర్ల పరిధిలో ఏప్రిల్​లో ప్రారంభమైన ఈ సర్వే గత నెలాఖరులో ముగిసింది. ఆయా అంగన్​వాడీ సెంటర్ల పరిధిలో 1,86,350 ఇండ్లలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 5,062 మంది గర్భిణులు, 3,673 మంది బాలింతలు, 12,375 మంది కిశోర బాలికలు ఉన్నట్టుగా తేలింది. -5 ఏండ్ల వయసున్న పిల్లలు 46,598 మంది ఉన్నారు.

కాగా, అన్ని వయసుల వారు 5,65,941 మంది ఉన్నారని తేలింది. జిల్లాలోని 0–6 ఏండ్ల మధ్య ఏజ్ పిల్లలు 46,598 మంది ఉన్నారు. వీరందరినీ స్టాండియో మీటర్​ద్వారా ఎత్తు కొలవడంతోపాటు ఎంత బరువు ఎంత ఉన్నారో చూశారు. అయితే వీరిలో 2,599 మంది ఎత్తుకు తగినట్టుగా బరువు లేరని తేలింది. వయసుకు తగిన విధంగా 4,464 మంది  బరువు తూగలేదు. 4,748 మంది వయసుకు తగినట్టుగా ఎత్తు పెరగలేదని తేలింది. మొత్తంగా 11,811 మంది బలహీనంగా ఉన్నట్లు తెలిసింది. 

సూర్యాపేట జిల్లాలో 13,474 మంది..

జిల్లాలోని చివ్వెంల, హుజూర్​నగర్, కోదాడ, సూర్యాపేట అర్బన్, తుంగతుర్తి ప్రాజెక్టుల పరిధిలోని 1,209 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. ఆయా సెంటర్ల పరిధిలో 1.86 లక్షల ఇండ్లలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 22,175 మంది కిశోర బాలికలు ఉన్నట్టుగా తేలింది. అదేవిధంగా 0-–5 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలు 44,575 మంది ఉన్నారు.

వీరందరికీ స్టాండియో మీటర్ ద్వారా ఎత్తు కొలవడంతోపాటు ఎంత బరువు ఉన్నారో చూశారు. వీరిలో 2,223 మంది ఎత్తుకు తగినట్టుగా బరువు లేరని తేలింది. వయసుకు తగిన విధంగా 4,404 మంది  బరువు తూగలేదు. వయసుకు తగినట్టుగా 6,847 మంది ఎత్తు పెరగలేదని తేలింది. మొత్తంగా 13,474 మంది బలహీనంగా ఉన్నట్లు తెలిసింది. 

కారణాలు ఇవీ..

పేదరికం, పేరెంట్స్ కు పౌష్టికాహారంపై అవగాహన లేకపోవడంతో పోరగాళ్లకు మంచి ఫుడ్​అందడం లేదు. దీంతో వారి శారీరక ఎదుగుదల, ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా 0-–6 ఏండ్లలోపు కొందరు పిల్లలు బలహీనమవుతున్నారు. వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరుగకపోవడం

ఎత్తుకు తగ్గట్టుగా బరువు అవకపోవడంతో వారి భవిష్యత్​ ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏజ్​కు తగిన ఎత్తు, బరువు లోపించడానికి పౌష్ఠికాహార లోపమే ప్రధాన కారణమైతే.. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు కూడా కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 

పౌష్టికాహారం అందిస్తే ఓకే..

బలహీనంగా ఉన్న వారికి రోజూ కోడిగుడ్డు, పాలు, పండ్లు, పప్పు దినుసులతోపాటు మంచి ఫుడ్​ను అందించాల్సి ఉంటుంది. రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్, స్పోర్ట్​ వల్ల ఉపయోగం ఉంటుంది. ఏజ్​కు తగిన ఎత్తు, బరువు పెరగని పిల్లలకు అంగన్‌‌‌‌వాడీ సెంటర్లలో స్పెషల్​ కేటగిరీగా గుర్తించి అదనపు పౌష్ఠికాహారం అందించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఆకలి పరీక్షలు నిర్వహించిన ప్రతి రెండు గంటలకు ఫుడ్​అందిస్తారు.

అవసరమైన వారికి గవర్నమెంట్​హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​తోపాటు మెడిసిన్స్​అందిస్తారు. అయినప్పటికీ హెల్త్​మెరుగుపడని వారిని స్పెషలైజ్​ హాస్పిటల్స్​రిఫర్​ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని చెకప్​ చేయిస్తారు. 

పోషణలోపం పిల్లలపై స్పెషల్ కేర్​

పోషణ లోపం కారణంగా వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండని పిల్లల ఆరోగ్యంపై స్పెషల్ కేర్​ తీసుకుంటాం. వారికి ప్రతిరోజూ పౌష్టికాహారంతోపాటు అదనంగా ఆహారం అందిస్తాం. అయినా సెట్​కాని పిల్లలను ట్రీట్​మెంట్​కు సిఫార్సు చేస్తాం. రెగ్యులర్​గా వారిని గమనిస్తూ వారి ఎదుగుదలను పరిశీలిస్తాం. అవసరమైతే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​ ఇప్పిస్తాం.

- కేవీ కృష్ణవేణి, జిల్లా వెల్ఫేర్​ ఆఫీసర్, యాదాద్రి