
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23 మంగళవారం మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కవిత నామినేషన్ పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ, రేగ కాంతారావు, జెడ్పీ చైర్మన్ లు బిందు తదితరులు పాల్గన్నారు.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పై భారీ మెజారిటీతో కవిత ఎంపీగా గెలుపొందింది. 20218 బీఆర్ఎస్ రెండో సారి అధికారం రావడం, కేసీఆర్ గాలి వీయడంతో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాలోతు కవిత ఘన విజయం సాధించింది. మరి ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ప్రస్తుతం ఆ పార్టీ కష్టకాలంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఎంపీగా మాలోతు కవిత గెలుస్తుందా? లేదా? చూడాలి.