మార్నింగ్​ వాకర్స్ తో మాలోత్​ కవిత మాటామంతీ

మార్నింగ్​ వాకర్స్ తో మాలోత్​ కవిత మాటామంతీ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలో బుధవారం మహబూబాబాద్​ లోక్​సభ నియోజకవర్గం బీఆర్​ఎస్​ అభ్యర్థి మాలోత్​ కవిత ప్రచారం చేశారు. ఉదయం గ్రౌండ్​లో మార్నింగ్​వాకర్స్ తో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. కొద్దిసేపు క్రికెట్​ బ్యాట్​ పట్టి ఆడారు. మార్నింగ్​ వాకర్స్ తో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై పార్లమెంట్​లో పోరాడానని వివరించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.


అశ్వాపురం : అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంటలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి నివాసంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.