మామా మశ్చీంద్ర రిలీజ్‌‌కు రెడీ

డిఫరెంట్ స్ర్కిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. వాటిలో  ‘మామా మశ్చీంద్ర’ ఒకటి. నటుడు హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్  క్యారెక్టర్స్‌‌లో నటిస్తున్నాడు. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్స్. బుధవారం ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. 

మరోవైపు సుధీర్ బాబు హీరోగా ‘మా నాన్న సూపర్ హీరో’ అనే మరో చిత్రం రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు బుధవారం ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామన్నారు. ఆర్ణ హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సాయి చంద్, షియాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాక జ్ఞాన సాగర్ దర్శకత్వంలో ‘హరోం హర’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది.