ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల సంఖ్యలో వాస్తవమెంత..? : మమతా బెనర్జీ

ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల సంఖ్యలో వాస్తవమెంత..? : మమతా బెనర్జీ

కోల్‌కతా : ఒడిశా రైలు ప్రమాదంలో  రైల్వే శాఖ ప్రకటించిన మృతుల సంఖ్య విషయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం తమ రాష్ట్రానికే చెందిన 61 మంది మృతి చెందారని, మరో 182 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ లెక్కన.. అసలు గణాంకాలు సరైనవేనా అని ప్రశ్నించారు. దీంతోపాటు వందే భారత్‌ రైళ్ల ఇంజిన్లు సామర్థ్యం మేర ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఒడిశాలో జూన్ 2వ తేదీ శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. 1100మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

తాను, నీతీశ్‌ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త సిగ్నల్ వ్యవస్థ, యాంటీ కొలిజన్ డివైజ్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తన హయాంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతటి సంఖ్యనైనా మార్చగలదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2002లో గోద్రాలో రన్నింగ్ లో ఉన్న ట్రైన్ లో మంటలు ఎలా చెలరేగాయి..? అంటూ ప్రశ్నించారు. కోరమాండల్, బెంగళూరు- హౌరా ఎక్స్‌ప్రెస్‌లలో యాంటీ కొలిజన్ పరికరం ఎందుకు లేదన్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఇంజిన్లు సామర్థ్యం మేర ఉన్నాయా..? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ‘వందే భారత్ పేరు బాగుంది. కానీ.. ఒక చెట్టు కొమ్మ మీద పడటంతో ఏం జరిగిందో చూశారు కదా!’ అని పూరీ- హావడా వందే భారత్ రైలును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతటి సంఖ్యనైనా మార్చగలదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2002లో రన్నింగ్ లో ఉన్న ట్రైన్ లో మంటలు ఎలా చెలరేగాయి..? అంటూ ప్రశ్నించారు. కోరమాండల్, బెంగళూరు- హౌరా ఎక్స్‌ప్రెస్‌లలో యాంటీ కొలిజన్ పరికరం ఎందుకు లేదన్నారు.

https://twitter.com/ani_digital/status/1665373918415208449

మరోవైపు ప్రమాదంలో గాయాలతో బయటపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల ఆర్థిక సాయంతో పాటు ప్రతి కుటుంబానికి రూ. 2 వేల చొప్పున రానున్న మూడు నెలల పాటు నిత్యావసరాల వస్తువులను అందిస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1665346752445296641

 

https://twitter.com/ANI/status/1665339508982960133