తమిళనాడు బాటలో బెంగాల్ .. నీట్​కు వ్యతిరేకంగా తీర్మానం : మమతా బెనర్జీ

తమిళనాడు బాటలో బెంగాల్ .. నీట్​కు వ్యతిరేకంగా తీర్మానం : మమతా బెనర్జీ

కోల్ కతా: తమిళనాడు బాటలో బెంగాల్ నడిచింది. నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ సర్కారు తీర్మానం చేసింది. ఈ సందర్భంగా బెంగాల్ విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు మీడియాతో మాట్లాడారు.. ‘‘దేశంలోని ఫెడరల్ సిస్టమ్​ను దెబ్బతీసేలా ఉన్న ఈ పరీక్షను కేంద్రానికి అప్పగించినప్పుడే మేం నిరసనలు తెలిపాం.

నీట్‌‌ను కేంద్రం నిర్వహించరాదని నాడు గుజరాత్‌‌ సీఎంగా ఉన్న మోదీ కూడా డిమాండ్ చేశారు” అని చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న చర్యపై బీజేపీ మండిపడింది. ‘‘ఎడ్యుకేషన్ సిస్టమ్​ను పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయేలా చేసిన వారు ఈ తీర్మానం తీసుకొస్తున్నారు. టీఎంసీ, పారదర్శకతకు అస్సలు సంబంధమే లేదు”అని బీజేపీ నాయకుడు శంకర్ ఘోష్ పేర్కొన్నారు.