కాంగ్రెస్ ను వీడిన్రు..ముఖ్యమంత్రులైన్రు

ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్​లో మమతాబెనర్జీ, అస్సాంలో హిమంత బిశ్వశర్మ, పుదుచ్చేరిలో ఎన్ఆర్ రంగస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. వీరి ముగ్గురిలో ఒక కామన్​ పాయింట్​ ఉంది. వీరు ముగ్గురు కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చిన తర్వాతే సీఎంలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో జగన్​మోహన్​రెడ్డి, మహారాష్ట్రలో శరద్​పవార్​ కూడా కాంగ్రెస్​ మాజీ లీడర్లే. ఈ రోజు జగన్​ సీఎం అయితే.. శరద్​ పవార్​ సూపర్​ చీఫ్​ మినిస్టర్​గా చక్రం తిప్పుతున్నారు. ఈ లీడర్లంతా సోనియాగాంధీ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా ఉన్న టైంలోనే ఆ పార్టీని వీడారు.

  • మమతాబెనర్జీ 1997లో కాంగ్రెస్​ పార్టీని వీడారు. అప్పుడు కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా ఉన్న సీతారాం కేసరి.. మమతను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్​ చేసిన బెంగాల్​లోని ఆమె ప్రత్యర్థులకు సపోర్ట్​ చేశారు. అప్పట్లో సోనియాగాంధీని కలిసిన మమతా బెనర్జీ ఈ అంశంలో కలుగజేసుకుని, పార్టీ నుంచి తనను బహిష్కరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టడం మానేయాలని సీతారాం కేసరికి చెప్పాల్సిన సోనియా.. అందుకు నిరాకరించారు. అదే సమయంలో ‘‘ప్రతి కాంగ్రెస్​ వర్కర్​ నాకు సమానమే. నేను ఈ విషయంలో కలుగజేసుకోలేను’’ అంటూ ఒక రాయల్​ క్వీన్​లాగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్​ను వదిలి బయటకొచ్చిన మమత.. 2011 నుంచి బెంగాల్​ చీఫ్​ మినిస్టర్​గా ఉన్నారు. 2010లో సోనియాగాంధీ.. మమతను కలిసి మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరాలని కోరారు. కానీ, మమతా బెనర్జీ తనను బహిష్కరించిన టైంలో సహాయం కోరితే సోనియా అన్న మాటలను గుర్తు చేశారు.
  • హిమంత బిశ్వశర్మ. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. ఆయన 2015లో కాంగ్రెస్​ పార్టీని వదిలేశారు. 2011లో అస్సాంలో కాంగ్రెస్​ విజయానికి ప్రతి ఒక్కరూ హిమంత బిశ్వశర్మకే క్రెడిట్స్​ ఇచ్చారు. ఆ టైంలో రాహుల్​ గాంధీని కలిస్తే శర్మను చాలా చులకనగా చూశారు. ఆయన చెప్పే మాటలు వినకుండా, పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ గడిపి శర్మను పట్టించుకోలేదు. హిమంత బిశ్వశర్మ ఎక్కడికీ వెళ్లలేరని రాహుల్​ భావించారు. కానీ, శర్మ వెంటనే బీజేపీలో జాయిన్​ అయ్యారు. అస్సాంలో కాంగ్రెస్​ పార్టీని తుడిచిపెట్టేశారు.
  • బీజేపీ మద్దతుతో ప్రస్తుతం పుదుచ్చేరి సీఎంగా ఎన్ఆర్​ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. 2011లో సోనియా పార్టీ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు రంగస్వామి కాంగ్రెస్​ను వదిలేశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ లీడర్​ నారాయణస్వామికి అవకాశం కల్పించడానికి రంగస్వామి పార్టీని వదిలి వెళ్లేలా సోనియా చుట్టూ ఉన్న కోటరీ చేసింది.
  • 1999లో శరద్​పవార్​ కాంగ్రెస్​ పార్టీని విడిచిపెట్టారు. ఆ టైంలో కాంగ్రెస్​ చీఫ్ గా సోనియానే ఉన్నారు. శరద్​ పవార్​ను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేసి చివరికి పార్టీని వదిలి వెళ్లేలా ఆయన ప్రత్యర్థులే చేశారు. శరద్​ పవార్​పై సోనియాలో అనుమానపు బీజాలు పడేలా చేశారు. దీంతో ఆయనను సోనియా పక్కన పెట్టడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన శరద్​ పవార్.. అప్పట్లో ప్రధాని కావాలనుకున్న​సోనియాను ఒక ఫారినర్​ అంటూ విమర్శించి పార్టీని వదిలిపెట్టారు. ఈ రోజు అదే శరద్​ పవార్​ ఒకే టైంలో కాంగ్రెస్​ పార్టీకి అటు మిత్రునిగా, ఇటు శత్రువుగా మారారు.
  • 2011లో వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చారు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్​మెంట్​ ఒక్కటే. తన తండ్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి మరణం తర్వాత తనను, తన తల్లిని ఢిల్లీకి పిలిపించుకున్న సోనియా.. 
  • తమను తీవ్రంగా అవమానపరిచారని జగన్​ ఆరోపించారు.
  • మమతాబెనర్జీ 1997లో కాంగ్రెస్​ పార్టీని వీడారు. అప్పుడు కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా ఉన్న సీతారాం కేసరి.. మమతను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్​ చేసిన బెంగాల్​లోని ఆమె ప్రత్యర్థులకు సపోర్ట్​ చేశారు. అప్పట్లో సోనియాగాంధీని కలిసిన మమతా బెనర్జీ ఈ అంశంలో కలుగజేసుకుని, పార్టీ నుంచి తనను బహిష్కరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టడం మానేయాలని సీతారాం కేసరికి చెప్పాల్సిన సోనియా.. అందుకు నిరాకరించారు. అదే సమయంలో ‘‘ప్రతి కాంగ్రెస్​ వర్కర్​ నాకు సమానమే. నేను ఈ విషయంలో కలుగజేసుకోలేను’’ అంటూ ఒక రాయల్​ క్వీన్​లాగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్​ను వదిలి బయటకొచ్చిన మమత.. 2011 నుంచి బెంగాల్​ చీఫ్​ మినిస్టర్​గా ఉన్నారు. 2010లో సోనియాగాంధీ.. మమతను కలిసి మళ్లీ కాంగ్రెస్​ పార్టీలో చేరాలని కోరారు. కానీ, మమతా బెనర్జీ తనను బహిష్కరించిన టైంలో సహాయం కోరితే సోనియా అన్న మాటలను గుర్తు చేశారు.
  • హిమంత బిశ్వశర్మ. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. ఆయన 2015లో కాంగ్రెస్​ పార్టీని వదిలేశారు. 2011లో అస్సాంలో కాంగ్రెస్​ విజయానికి ప్రతి ఒక్కరూ హిమంత బిశ్వశర్మకే క్రెడిట్స్​ ఇచ్చారు. ఆ టైంలో రాహుల్​ గాంధీని కలిస్తే శర్మను చాలా చులకనగా చూశారు. ఆయన చెప్పే మాటలు వినకుండా, పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ గడిపి శర్మను పట్టించుకోలేదు. హిమంత బిశ్వశర్మ ఎక్కడికీ వెళ్లలేరని రాహుల్​ భావించారు. కానీ, శర్మ వెంటనే బీజేపీలో జాయిన్​ అయ్యారు. అస్సాంలో కాంగ్రెస్​ పార్టీని తుడిచిపెట్టేశారు.
  • బీజేపీ మద్దతుతో ప్రస్తుతం పుదుచ్చేరి సీఎంగా ఎన్ఆర్​ రంగస్వామి ప్రమాణస్వీకారం చేశారు. 2011లో సోనియా పార్టీ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు రంగస్వామి కాంగ్రెస్​ను వదిలేశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ లీడర్​ నారాయణస్వామికి అవకాశం కల్పించడానికి రంగస్వామి పార్టీని వదిలి వెళ్లేలా సోనియా చుట్టూ ఉన్న కోటరీ చేసింది.
  • 1999లో శరద్​పవార్​ కాంగ్రెస్​ పార్టీని విడిచిపెట్టారు. ఆ టైంలో కాంగ్రెస్​ చీఫ్ గా సోనియానే ఉన్నారు. శరద్​ పవార్​ను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేసి చివరికి పార్టీని వదిలి వెళ్లేలా ఆయన ప్రత్యర్థులే చేశారు. శరద్​ పవార్​పై సోనియాలో అనుమానపు బీజాలు పడేలా చేశారు. దీంతో ఆయనను సోనియా పక్కన పెట్టడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన శరద్​ పవార్.. అప్పట్లో ప్రధాని కావాలనుకున్న​సోనియాను ఒక ఫారినర్​ అంటూ విమర్శించి పార్టీని వదిలిపెట్టారు. ఈ రోజు అదే శరద్​ పవార్​ ఒకే టైంలో కాంగ్రెస్​ పార్టీకి అటు మిత్రునిగా, ఇటు శత్రువుగా మారారు.
  • 2011లో వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి కాంగ్రెస్​ నుంచి బయటకొచ్చారు. అప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్​మెంట్​ ఒక్కటే. తన తండ్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి మరణం తర్వాత తనను, తన తల్లిని ఢిల్లీకి పిలిపించుకున్న సోనియా.. తమను తీవ్రంగా అవమానపరిచారని జగన్​ ఆరోపించారు.

బీజేపీకి కలిసొచ్చిన వెల్​కం పాలసీ

చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పార్టీని చాలెంజ్​ చేసే స్థాయిలో మాస్​ ఫాలోయింగ్​ కలిగిన లీడర్లు తమకు లేరనే విషయాన్ని 2013లోనే బీజేపీ గుర్తించింది. అప్పటి నుంచి తమ స్ట్రాటజీని మార్చుకుంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టింది. ఈ వెల్కమ్​ పాలసీతోనే బీజేపీ చాలా ఎక్కువగా బలపడింది. హిమంత బిశ్వశర్మ, బెంగాల్​లో సువేందు అధికారి, ఒడిశాలో బిజయంత పాండా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన డజన్ల కొద్దీ మాజీ మినిస్టర్లు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్​ చేజార్చుకుంటే.. బీజేపీ బలపడింది. అయితే ఇది కాంగ్రెస్​ పార్టీకే పరిమితం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా వారసత్వ రాజకీయాలతో చాలా పార్టీలు మంచి లీడర్లను కోల్పోయాయి.
- పెంటపాటి 
పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్