సీఎం మమతా బెనర్జీ రిక్వెస్ట్ : వర్షంలో తడవకుండా ఇంట్లోకి రావాలి

సీఎం మమతా బెనర్జీ రిక్వెస్ట్ : వర్షంలో తడవకుండా ఇంట్లోకి రావాలి

కోల్‌కతా జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పా్ట్లు చేశారు. శనివారం సాయంత్రం నిరసనకారుల్లో 15 మంది జూనియర్ డాక్టర్లను ఆమె నివాసానికి పిలిచారు. కానీ.. ఆమెతో మాట్లాడటానికి 40 విద్యార్థులు అక్కడికి వచ్చారు. వారు వర్షంలో తడుస్తూనే దీదీ ఇంటి బయట నిలబడ్డారు. చాలాసేపటి నుంచి మమతా బెనర్జీ వారి కోసం వెయిట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ తన ఇంటి బయట వర్షంలో తడుస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను శనివారం రాత్రి 8 గంటల సమయంలో కలిశారు.

RG కర్ హాస్పిటల్ లో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్యను పరిష్కరించడానికి చర్చలు ఆలస్యం కావడంపై ఆమె నిరాశను వ్యక్తం చేశారు. వారి డిమాండ్లు చెప్పేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కావాలని విద్యార్థులు కోరారు. జూనియర్ డాక్టర్లతో జరిపే చర్చలను రికార్డ్ చేయాలని వారు పట్టుబట్టారు. దానికి ముఖ్యమంత్రి మొదట అంగీకరించకున్నా తర్వాత.. ఓకే అన్నారు.

also read : లంచం ఇవ్వకపోతే చంపేస్తారేయ్..! కాంట్రాక్టర్‌ను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

మమతా బెనర్జీ ఇంటి బయట ఉన్న  విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈరోజు మీరు నాతో సమావేశం కావాలని చెప్పారు. దానికి నేను అంగీకరించి.. నేను వేచి ఉన్నాను. దయచేసి నన్ను ఇలా అవమానించవద్దు. ఇంతకు ముందు మీకోసం 2 గంటలు ఎదురుచూసినా నువ్వు రాలేదు. 

ఆమెను కలవడానికి ఇష్టపడకపోతే కనీసం ఆమె ఇంటి లోపలికి వచ్చి ఓ కప్పు టీ తాగాలని జూనియర్ డాక్టర్లను కోరారు సీఎం మమతా బెనర్జీ. మేమంతా - చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) మరియు హోం సెక్రటరీ - మీ అందరి కోసం ఎదురుచూస్తున్నాము మమతా అన్నారు. జూనియర్ డాక్టర్లు వర్షంలో తడవకుండా ఇంట్లోకి రావాలని మమతా బెనర్జీ కోరారు.