ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: మమతా బెనర్జీ

ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: మమతా బెనర్జీ

విశాఖపట్నంలో జరిగిన టీడీపీ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు మమతాబెనర్జీ. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మమత.. ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవని.. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబు మరోసారి సీఎం కావాలన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు సహకరిస్తామన్నారు.

రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు..రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల ఇళ్లు కట్టించామని.. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు భరోసా కల్పించామన్నారు.