
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ నిజాంపేటలోని మమత హాస్పిటల్ నిర్వాహకులు ఓ మహిళలకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి యాజమాన్యం గురువారం వెల్లడించింది. సిటీకి చెందిన ఎల్లమ్మ (50) అనే మహిళకు గర్భాశయంలో కణితి (ఓవేరియన్సిస్ట్) ఏర్పడింది.
దీంతో ఆమె పలు ఆసుపత్రులను వైద్యం కోసం సంప్రదించింది. ఆమెకు గుండె జబ్బు ఉండడంతో చికిత్స చేయడానికి పలు డాక్టర్లు వెనుకంజవేశారు. దీంతో ఎల్లమ్మ నిజాంపేటలోని మమత ఆసుపత్రిలో చేరింది. డాక్టర్ మైత్రి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం సుమారు 5 కిలోల కణితిని తొలగించారు. సమావేశంలో డాక్టర్ నవీశ్వర్, ధీరజ్ పాల్గొన్నారు.