కోల్కతా: బీజేపీది యాంటీ దళిత్ మైండ్సెట్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అమిత్ షా కామెంట్లతో బీజేపీ ముసుగు తొలగిపోయిందన్నారు. అంబేద్కర్ను ఉద్దేశిస్తూ అమిత్ షా చేసిన కామెంట్లు క్షమించరానివని ఫైర్ అయ్యారు. బాబా సాహెబ్ అడుగుజాడల్లో నడిచే కోట్లాది మందిని అమిత్ షా అవమానించారన్నారు.
కులాలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తున్నదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 240 సీట్లు వస్తేనే ఇలా ప్రవర్తిస్తున్నారని, అదే 400 సీట్లు గెలిచి ఉంటే ఇంకేం అయ్యేదోనని విమర్శించారు. అంబేద్కర్ చేసిన కృషిని పూర్తిగా తుడిచిపెట్టేలా చరిత్రను తిరగరాసి ఉండేవాళ్లని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.