ఏసీబీ వలలో మామడ ఎస్‌ఐ

ఏసీబీ వలలో మామడ ఎస్‌ఐ

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. లంచం తీసుకుంటున్న ఓ ఎస్సైని అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఎసిబి) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని ఆనంతపెట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్.. ఇటీవల ఓ వక్యితో గొడవపడ్డాడు. ఈ ఘటనలో సతీష్ పై మామడ ఎస్సై.. 323, 341, 291 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి  అరెస్టు చేశాడు.

 అయితే, రిమాండ్ చేస్తానంటూ బెదిరస్తూ.. రూ.10వేలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తానని ఎస్సై బేరం కుదుర్చుకున్నాడు.  దీంతో సతీష్  సోదరుడు ఏసిబి అధికారులను ఆశ్రయించి.. జరిగిన విషయం చెప్పగా.. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఎసిబి ఆధికారులు.. రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సైని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.