మోడల్ మార్కెట్ తో చిరు వ్యాపారులకు ఉపాధి

తొర్రూరు: మోడల్ మార్కెట్ తో చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తోందని, మార్కెట్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని మోడల్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఆదివారం ఆమె సందర్శించారు. కూరగాయలు అమ్ముతున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడల్ మార్కెట్లో త్వరలోనే నాన్ వెజ్ అమ్మకాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై మున్సిపల్ అధికారులతో మాట్లాడతానన్నారు.

మార్కెట్​లో టాయిలెట్స్, డ్రింకింగ్​వాటర్​సమస్య ఉందని వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా, త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, త్వరలోనే ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్​ మార్కెట్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు చెప్పారు. తొర్రూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్​అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్లు తూనం రోజ, దొంగరి రేవతి, కొలుపుల శంకర్, కాంగ్రెస్ లీడర్లు మెరుగు మల్లేశం గౌడ్, భిక్షం గౌడ్, నల్లపు రాజు, తూనం శ్రావణ్ కుమార్, బిజ్జాల అనిల్, ముద్దసాని సురేశ్, ప్రవీణ్ గౌడ్, యూత్ టౌన్ ​ప్రెసిడెంట్​మహేశ్​యాదవ్ పాల్గొన్నారు.