- చెరుకు రైతు సంఘం నాయకులు
- మొక్కు చెల్లించుకున్న రైతులు
కొండగట్టు, వెలుగు : చెరుకు రైతులను మోసంచేసిన గత ప్రభుత్వం ఓడిపోయిందని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సాధన సమితి అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేయడం శుభపరిణామం అన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కోసం గతంలో కొండగట్టు అంజన్నకు కట్టిన ముడుపును రైతు నాయకులు విప్పి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు రైతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానని కల్లబొల్లి మాటలతో కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు, సత్యం రెడ్డి, కరన్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.