మెట్ పల్లి, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించేదాకా రాజీ లేని పోరాటాలు చేస్తామని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం షుగర్ ఫ్యాక్టరీల రీఓపెన్ కోసం చేపట్టాల్సిన ప్రణాళికలపై 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ మీటింగ్పోస్టర్ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీలను అధికారంలోకి రాగానే ప్రభుత్వపరం చేసుకొని 100 రోజుల్లో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ పునరుద్దరణ కమిటీ ప్రెసిడెంట్ గురిజల రాజారెడ్డి, లీడర్లు అంజయ్య, రాజేందర్ పాల్గొన్నారు.