
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ లోని రామాలయం వద్ద ఈనెల 15 నుంచి సీతారాముల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతి అన్నారు. బుధవారం రామాలయం వద్ద తూప్రాన్ పట్టణ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. 15న గణపతి పూజ, 17న కల్యాణం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నారాయణ గుప్తా, శ్రీశైలంగౌడ్, పట్టణ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ALSO READ : నల్ల పోచమ్మ హుండీ ఆదాయం రూ.5.48 లక్షలు