Mamitha Baiju: ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. కొత్త సినిమా అప్‌‌‌‌‌‌‌‌డేట్‌

Mamitha Baiju: ప్రేమలు ఫేమ్ మమిత బైజు.. కొత్త సినిమా అప్‌‌‌‌‌‌‌‌డేట్‌

అక్షయ్‌‌‌‌‌‌‌‌, మమిత బైజు (‘ప్రేమలు’ ఫేమ్) జంటగా దినేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కృష్ణ’.  ఐశ్వర్య మరో హీరోయిన్.  పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను తెలియజేస్తూ సోమవారం ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ ‘మా కుటుంబానికి, కృష్ణుడికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రం’ అని చెప్పాడు.  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది ఐశ్వర్య. రచయిత, నిర్మాత పీఎన్ బలరామ్ మాట్లాడుతూ  ‘మా కుటుంబం శ్రీకృష్ణుడిని ఎంతగానో ఆరాధిస్తాం. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్‌‌‌‌‌‌‌‌నే కథగా తీసుకొని, ఈ సినిమాని రూపొందిస్తున్నాం.

ఈ చిత్రం కోసం మేము స్టార్స్‌‌‌‌‌‌‌‌ని తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.