Mamla Legal Hai Season2: నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో ఆ కోర్డ్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది

Mamla Legal Hai Season2: నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో ఆ కోర్డ్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది

రాహుల్ పాండే డైరెక్షన్ లో యాక్టర్ రవి కిషన్, నైలా గ్రేవాల్, నిధి బిష్త్, అనత్ జోషి, యశ్పాల్ శర్మ, అమిత్ విక్రమ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ వెబ్ సీరిస్ మామ్లా లీగల్. ఇదొక హైకోర్టు డ్రామా ఫిల్మ్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ లో రిలీజైన ఈ డ్రామా సీరిస్ (మార్చి 1) నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సీరిస్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో..నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌ రెండో సీజన్ కూడా వచ్చేస్తోందంటూ అఫీసియల్గా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 

కథేంటంటే:

త్యాగి (రవికిషన్) ఢిల్లీ పరిధిలోని ‘పట్ పర్ గంజ్’ జిల్లా కోర్టులో అడ్వకేట్‌‌‌‌గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి గతంలో జడ్జిగా పనిచేసేవాడు. కానీ.. త్యాగి అతని తండ్రి పేరు వాడకుండా సొంతంగా ఎదగాలి అనుకుంటాడు. కానీ.. అందుకు ఎంచుకునే మార్గమే సరిగ్గా ఉండదు. అదే కోర్టులో పనిచేసే చాలామంది లాయర్లు కేసులు లేక వెయిట్‌‌‌‌ చేస్తుంటారు. కోర్టు దగ్గరికి ఎవరైనా వస్తే చాలు వెంటనే వాళ్ల దగ్గరికి కేసు కోసం పరిగెత్తుతుంటారు. అదే కోర్టు ఆవరణలో ఉన్న పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఒక టేబుల్ వేసుకుని కేసుల కోసం చూస్తుంటుంది సుజాత దీదీ (నిధి బిష్త్ ). కనీసం ఛాంబర్‌‌‌‌‌‌‌‌కి మారడానికి సరిపడా డబ్బు సంపాదించలేకపోతుంది. అలాంటి కోర్టుకు అప్పుడే లా గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన అనన్య ష్రాఫ్ (నైలా గ్రేవాల్) వస్తుంది. అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది.

ALSO READ :- కేజ్రీవాల్‌కు ఊరట.. సీఎం పదవి నుంచి తొలగించలేం : ఢిల్లీ హైకోర్టు

ఎలాగైనా మొదటి కేసు టేకప్‌‌‌‌ చేచాలి. గెలవాలి అనుకుంటుంది. బాగా డబ్బున్న ఫ్యామిలీ ఆమెది. పైగా ఆమె పూర్వీకులు కూడా లాయర్లుగా పనిచేసినవాళ్లే. కాబట్టి అమెని అక్కడి వాళ్లంతా గౌరవిస్తారు. ఆ టైంలోనే ఢిల్లీ బార్ అసోసియేషన్  ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. త్యాగి ఆ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంటాడు. అనన్యకి కేసు దొరుకుతుందా? బార్ అసోసియేషన్ ఎన్నికల్లో త్యాగి గెలుస్తాడా? సుజాత ఛాంబర్ కల నిజమవుతుందా? అనేది తర్వాతి కథ. ఈ సిరీస్‌‌‌‌లో కావాల్సినంత కామెడీ ఉంది. కానీ..కథలో ట్విస్ట్‌‌‌‌లు మాత్రం కనిపించవు. రవికిషన్, నైలా గ్రేవాల్ యాక్టింగ్‌‌‌‌ బాగుంది. కథ నెమ్మదిగా సాగడం.. ఎక్కువ భాగం కోర్టు దగ్గరే ఉండడం వల్ల కొంచెం విసుగు తెప్పిస్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)