మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) హీరోగా ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన మూవీ భ్రమయుగం (Bramayugam). ఈ పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ ఫిబ్రవరి 15న మలయాళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.
రూ.28 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజైన 9 రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దాదాపు రూ.30 కోట్లకు సోనీ లివ్ (Sony LIV) భ్రమయుగం మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.దీన్ని బట్టి చూస్తే..మమ్ముట్టి కెరీర్లోనే హైయెస్ట్ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా భ్రమయుగం నిలిచింది.
ప్రస్తుతం ఈ సినిమా (ఫిబ్రవరి 23న) తెలుగు వెర్షన్ థియేటర్స్ లో రిలీజయ్యి పాజిటవ్ టాక్ తెచ్చుకుంది. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. కనుక ఈ సినిమాను మార్చి చివరి వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం కన్నూర్ స్క్వాడ్ (Kannur Squad). కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ..వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేరళ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో మరియు బజూకతో పాటు మరో మూవీలో నటిస్తున్నారు.