Bazooka Trailer: మమ్ముట్టి బాజూకా ట్రైలర్ టాక్.. సీరియల్ కిల్లర్‌ను చేధించే యాక్షన్ థ్రిల్లర్

Bazooka Trailer: మమ్ముట్టి బాజూకా ట్రైలర్ టాక్.. సీరియల్ కిల్లర్‌ను చేధించే యాక్షన్ థ్రిల్లర్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బజూకా’ (Bazooka).లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, జగదీశ్, సిద్ధార్థ్ భరతన్, సన్నీ వేన్, షైన్ టామ్ చాకో, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ ట్రైలర్ ACP బెంజమిన్ జాషువా పాత్రను గౌతమ్ మీనన్ పరిచయం చేయడంతో స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్‌లో బాగా శిక్షణ పొందిన పోలీసు బృందంతో తెలివిగల పోలీసు అధికారిగా పరిచయం చేశారు. అతను పోలీసు యూనిఫామ్‌లో వచ్చి.. తలుపు తెరవమని ఓ రౌడీ గ్రూప్ ను తనదైన శైలిలో అడగడం ఆకట్టుకుంది.

ఆ తర్వాత మమ్ముట్టి ఎంట్రీ రివీల్ అయింది. ఇతడో మిస్టర్ నోబడీ కానీ సమ్‌బడీ అంటూ మమ్ముట్టి పాత్ర వినోద్ మీనన్ గురించి గౌతమ్ మేనన్ పాత్ర చెబుతుంది. స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న బాజూకా ట్రైలర్ చూస్తుంటే.. బెంజమిన్ మరియు వినోద్ మధ్య సాగే థ్రిల్లర్ లా ఉంది. ఒక సీరియల్ కిల్లర్‌ను వేటాడే క్రమంలో చేసే ఇన్వెస్టిగేషన్ ఇదని తెలుస్తోంది.

2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న బజూకా ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచేసింది. ఈ సినిమాతో స్క్రీన్ రైటర్ కలూర్ డెన్నిస్ కుమారుడు డీనో డెన్నిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ  ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. అబ్రహం ఓజ్లర్, భ్రమయుగం, టర్బో చిత్రాలతో ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చిన మమ్ముట్టి బజూకా తో ఎలాంటి హిట్ ఇవ్వనున్నాడో ఆసక్తి నెలకొంది. 

ALSO READ | L2 Empuraan X Review: మోహన్ లాల్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌ 2’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

బాజూకా చిత్రాన్ని సరేగామా ఇండియా లిమిటెడ్ బ్యానర్, యూడ్లీ ఫిల్మ్స్ పై విక్రమ్ మెహ్రా మరియు సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ కు చెందిన డోల్విన్ కురియాకోస్ మరియు జిను వి అబ్రహం సహకారంతో నిర్మించారు.