
72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో మూవీ మే 23న థియేటర్లో రిలీజై మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
టర్బో ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే..మమ్ముట్టి కెరీర్లోనే అతిపెద్ద ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. అంతేకాదు..6.15 కోట్ల గ్రాస్‌తో 2024 సంవత్సరంలో మలయాళం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద ఓపెనింగ్ సాధించి రికార్డ్ వేట కొనసాగిస్తోంది.ఇక ఈ టర్బో మూవీ ఓవర్‌సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా యాక్షన్ మూవీలో ప్రతి ఎలిమెంట్ అన్నిరకాల ఆడియాన్స్ కు తెగ నచ్చేసింది.
మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అవతారంలోకనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇందులో విలన్ గా నటించిన రాజ్ బీ శెట్టి విలనిజం ఎలేవేషన్స్ హై లెవెల్ లో ఉన్నాయని..హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ గూస్‌బంప్స్ కలిగిస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. మరి ఈ వీకెండ్ లో టర్బో రేంజ్ ఎలా పెరగనుందో చూడాలి.
గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం కన్నూర్ స్క్వాడ్ (Kannur Squad).కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ..వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేరళ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది.అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా..అలాగే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.ప్రస్తుతం మమ్ముట్టి బజూక సినిమాలో నటిస్తున్నాడు.
#Turbo speeding into the hearts of ladies and family audiences ?? Delighted to hear the responses ❤️? Thank you all.#Mammootty #MammoottyKampany #TurboMovie @mammukka @SamadTruth @TurboTheFilm @DQsWayfarerFilm pic.twitter.com/mTV0fXzjtE
— MammoottyKampany (@MKampanyOffl) May 24, 2024