Malayalam Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Malayalam Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ఇటీవలే మమ్ముట్టి నటించిన టర్బో మూవీ థియేటర్లో రిలీజై మంచి కలెక్షన్స్ రాబట్టింది.కానీ, అంతకు ముందుగా మమ్ముట్టి నటించిన భ్రమయుగం, కన్నూర్ స్క్వాడ్ మూవీస్ కంటే తక్కువ కలెక్షన్స్ ని టర్బో దక్కించుకున్నది . కాగా..వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు.మమ్ముట్టి తన బ్యానర్‌‌పై నిర్మించారు.

ట‌ర్బో ఓటీటీ:

ఈ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ట‌ర్బో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను సోనీ లివ్ సొంతం చేసుకున్న‌ది.వచ్చే నెల ఆగ‌స్ట్‌ సెకండ్ వీక్లో ట‌ర్బో మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు..సోనీ లివ్ స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్ర‌క‌టించింది.అయితే,డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు.కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగ‌స్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ కు రానున్న‌ట్లు స‌మాచారం.మ‌ల‌యాళంతో పాటు తెలుగు,త‌మిళం,క‌న్న‌డ‌,హిందీ భాష‌ల్లో ట‌ర్బో రిలీజ్ కానుంది. 

Also Read:మిస్టర్ బచ్చన్ నుండి కొత్త సాంగ్

గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad).కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన క‌న్నూర్ స్క్వాడ్‌ మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేర‌ళ‌ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది.అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా..అలాగే చీకటి యుగాల నేపథ్యంలో వచ్చిన భ్రమయుగం మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.ప్రస్తుతం మమ్ముట్టి బజూక సినిమాలో నటిస్తున్నాడు.ప్రస్తుతం బజూక రిలీజ్ కు రెడీగా ఉండగా..మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.