స్టార్ హీరోకి క్యాన్సర్ అంటూ ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?

స్టార్ హీరోకి క్యాన్సర్ అంటూ ప్రచారం.. అసలు నిజం ఏంటంటే..?

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. యాత్ర సినిమా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ఈ స్టార్ హీరో ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాడు. అయితే గత వారం రోజులుగా నటుడు మమ్ముట్టి గురించి సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మమ్ముట్టికి క్యాన్సర్ వ్యాధి కన్ఫర్మ్ అయ్యిందని అందుకే షూటింగులకి బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నాడని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి.. 

దీంతో ఈ క్యాన్సర్ రూమర్స్ పై మమ్ముట్టి పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్) టీమ్ స్పందించింది. ఇందులోభాగంగా మమ్ముట్టి క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే రంజాన్ నెల కావడంతో ఉపవాసాలు ఉంటున్నారని అందుకనే సినిమా షూటింగులకు వెళ్లడంలేదని అంతేతప్ప ఇతర కారణాలు లేవని కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని సూచించారు. ఇక సినీ స్టార్స్ గురించి ఏదైనా వార్త పబ్లిష్ చేసేముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ | OTT Thriller: ఓటీటీకి సూక్ష్మదర్శిని హీరో మరో డ్రామా థ్రిల్లర్.. బంగారం, డ‌బ్బు మాత్ర‌మే కాపురాల‌ను నిలబెడతాయా?

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మమ్ముట్టి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకిని మలయాళ స్టార్ డైరెక్టర్ మహేష్ నారాయణ్ MMMN అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలకపాత్రలో నటిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ నిర్మిస్తోంది.