అన్ స్టాపబుల్ షో చూసి..బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు... రూ.83 లక్షలు పోగొట్టుకున్నాడు..

అన్ స్టాపబుల్ షో చూసి..బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు... రూ.83 లక్షలు పోగొట్టుకున్నాడు..

బెట్టింగ్ యాప్స్ ఉదంతం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది.. యూట్యూబర్స్ తో మొదలైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల పరంపర టాలీవుడ్ స్టార్స్ వరకు చేరింది. టాలీవుడ్ స్టార్లు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ సహా 25 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రముఖ ఓటీటీ యాప్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. హీరో బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ షోలో ఫన్ 88 బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం సంచలనంగా మారింది. అన్ స్టాపబుల్ షో చూసి ఫన్ 88 యాప్ డౌన్లోడ్ చేసుకొని 83 లక్షలు నష్టపోయానని.. ఆరోపిస్తున్నారు ఓ వ్యక్తి.

ఆహాలో స్ట్రీమ్ అయ్యే అన్ స్టాపబుల్ షో చూసి ఫన్ 88 బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నానని.. ఈ యాప్ లో బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని వాపోతున్నాడు బాధితుడు. మొదటిసారి రూ. 10వేలు పెట్టగా 18వేలు వచ్చాయని.. అలా వస్తూ, పోతూ రూ. 3లక్షల దాకా సంపాదించానని.. అప్పులు కట్టేశానని చెబుతున్నాడు బాధితుడు.

Also Read:-చేతినిండా సంపాదిస్తున్నారు.. ఇంకా ఈ పాడు పని ఎందుకు..

డబ్బులు వచ్చాయి కదా అని మళ్ళీ ఆడానని.. ఆ తర్వాత డబ్బులు పోవడం మొదలయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. ఊర్లో, బంధువులతో.. అప్పులు చేశానని.. మొత్తం 83 లక్షలు పోగొట్టుకున్నానని తెలిపాడు బాధితుడు. అప్పుల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోయి వచ్చానని తెలిపాడు బాధితుడు. మరి.. ఘటనపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.