
జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని యువతి,యువకుడు రైలు కింద పడి చనిపోయారు. వారి తలలు మాత్రమే పగిలి ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలు నడుస్తున్న క్రమంలో డోర్ వద్ద కూర్చొని ప్రమాదవశాత్తు పడి చనిపోయారా? లేక ఎవరైనా హత్య చేసి ట్రాక్ వద్ద పడేశారా? అనే విషయం తేలాల్సి ఉంది. రైలు నుంచి జారి పడితే ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యేవని, కానీ, అలాంటివేమీ కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారు ప్రేమికులు కావచ్చని అంటున్నారు. ఈ ప్రమాదం రాత్రి జరగడంతో ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకోలేదు.