
ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఒక యువకుడు ఆ తర్వాత సెలెక్ట్ అయినట్టు తెలుసుకున్నాడు. కానీ అతను ఏ పోస్టుకైతే అప్లై చేశాడో దానికి కాకుండా వేరే పోస్టుకు సెలెక్ట్ కావడంతో అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
యష్ ఆచార్య అనే యువకుడు X లో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జెప్టో (Zepto)లో ప్రొడక్ట్ డిజైనర్ పోస్టు కోసం తాను దరఖాస్తు చేశానని, .. కానీ ముంబైలోని 'డెలివరీ బాయ్' పోస్టుకి తాను సరిపోతాడని కంపెనీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆచార్యను షాక్ కు గురి చేసింది. Zepto నుంచి వచ్చిన ఇమెయిల్‌లో, "Zeptoలో ఈ డెలివరీ బాయ్ (ముంబై) పోస్టుకు మీరు బాగా సరిపోతారు" అని ఉంది. కానీ తాను ప్రొడక్ట్ డిజైనర్ పోస్టుకు అప్లై చేశాను అంటూ ఆచార్య క్యాప్షన్ లో రాసుకువచ్చాడు.
ఈ పోస్టు తక్కువ సమయంలోనే చాలా మందిని ఆకర్షించింది. వారిలో Zepto వ్యవస్థాపకుడు మరియు CTO, కైవల్య వోహ్రా కూడా ఉన్నారు. వోహ్రా ఆచార్యను ప్రొఫెషనల్ ప్లాట్‌ఫారమ్ 'లింక్డ్‌ఇన్'లో సంప్రదించి అతని CVని అడిగాడు. వోహ్రా నుంచి తనకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌ను సదరు వ్యక్తి షేర్ చేశాడు.
Par maine to product designer ke liye apply kiya tha? pic.twitter.com/R1yBJHd8LB
— yash (@yashachaarya) August 16, 2023