
ఏటీఎంలో డబ్బులు దొంగలించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలాపూర్ పరిధిలోని జల్ పల్లిలో నివాసముంటున్న 27ఏళ్ల మహ్మద్ అబ్దుల్ మోమిన్ ఖాన్ అనే యువకుడు గత గురువారం నగరంలో తక్కుగూడ రోడ్డు మార్గంలో ఉన్న ఓ ఏటీఎంలోకి చొరబడ్డాడు.
డబ్బులు దొంగలించేందుకు గ్యాస్ కట్టర్ తో ఏటీఎం క్యాస్ చెస్ట్ ను ఓపెన్ చేసుందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఏటీఎంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు జనవరి 13వ తేదీ శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు ప్రవేశపెట్టి.. రిమాండ్ కు తరలించారు.