జూబ్లీహిల్స్, వెలుగు: ఓ టీవీ చానల్లో న్యూస్ ప్రెజెంటర్‌ను వేధిస్తున్న యువకుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ కొత్తమాణిక్ నగర్‌కు చెందిన లావణ్య రోడ్డు నంబర్ 36లోని ఓ న్యూస్ చానల్లో న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు హరీశ్ అనే యువకుడితో ఐదేండ్లుగా పరిచయం ఉంది. అయితే, హరీశ్ ఓ యువతిని వివాహం చేసుకోవడంతో అతనితో ఏడాది నుంచి లావణ్య మట్లాడడం మానేసింది.
అయినా హరీశ్మద్యం తాగి ఆమెను ఫాలో అవుతూ డ్యూటీలో ఉన్న సమయంలో తోటి ఉద్యోగుల సమక్షంలో ఆమెను దుర్భాషలాడాడు. ఆమె వారిస్తున్నా వినకుండా మొబైల్ కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో అతనిపై లావణ్య ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.