
జూబ్లీహిల్స్, వెలుగు: హోటల్వ్యాపారంలో సహకరిస్తానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లి అల్వీన్కాలనీకి చెందిన ఆరేటి జ్ఞానసాయి ప్రసాద్(29) ఐటీ ఉద్యోగి. ఏదైనా వ్యాపారం చేయాలని సన్నిహితులతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన గోవర్ధన్(35) అతనికి పరిచయమయ్యాడు.
గోవర్ధన్ గతంలో ఫైర్ సర్వీస్‌లో హోంగార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం అమూల్మిల్క్డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తూ టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని ప్రసాద్‌ను నమ్మించాడు. తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని, వారి ద్వారా హోటల్‌కు కావ్సాలిన ఫర్నిచర్, ఇతర ఐటమ్స్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకోసం పలు దఫాలుగా రూ.2,82,725 తీసుకున్నాడు.
ఆ తర్వాత గోవర్ధన్ఫోన్ స్విచ్చాఫ్రావడం, పత్తా లేకుండా పోవడంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు తరలించారు.