
జూబ్లీహిల్స్, వెలుగు: ఓ మహిళ స్నానం చేస్తుండగా, మొబైల్లో ఆమె వీడియో తీసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మరియ కుమార్ (23) బోర బండలో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధురానగర్కమ్యూనిటీ హాల్లో పనిచేయడానికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడి బాత్రూమ్లో ఓ మహిళ స్నానం చేస్తుండగా, మొబైల్లో వీడియో తీశాడు. ఇది గమనించిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుగా, నిందితుడిని అరెస్ట్ చేశారు.