సోషల్​మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయం.. వ్యక్తి అరెస్ట్

సోషల్​మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయం.. వ్యక్తి అరెస్ట్

జీడిమెట్ల: ముంబై నుంచి -ఎండీఎంఏ డ్రగ్స్​  తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ ​చేశారు.  అతని నుంచి రూ.4.40 లక్షల విలువైన డ్రగ్స్​స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ భవ్​నగర్​కు చెందిన గులాని అసీఫ్​ (30) బతుకుదెరువు కోసం హైదరాబాద్​ వచ్చాడు. పలు బేకరీల్లో పనిచేశాడు. తక్కువటైంలో ఎక్కువ ఆదాయం కోసం డ్రగ్ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముంబై వెళ్లి అక్కడ అలీ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్​ ​కొనుగోలు చేశాడు. హైదరాబాద్​ వచ్చి సోషల్ మీడియా ద్వారా కన్స్యూమర్స్​ని సంప్రదించేవాడు. 

ఇందులో భాగంగా  గురువారం ఏండీఎంఏ డ్రగ్స్​కు అలవాటు పడ్డ బేగంబజార్​కు చెందిన తరుణ్​వ్యాస్​ (27), ఈస్ట్​మారెడు పల్లికి చెందిన మహ్మద్ ముజామిల్​ఇక్బాల్(26), రామంతాపూర్​కు చెందిన సుశాంత్​ (27)కు విక్రయిస్తుండగా  మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.40 లక్షల విలువచేసే 20గ్రాముల ఎండీఎంఏ డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్​డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.